#IchataVahanamuluNiluparadu - ట్రైలర్ రివ్యూ

Monday,August 23,2021 - 04:25 by Z_CLU

చిలసౌ తర్వాత హీరోగా కొంచెం గ్యాప్ తీసుకున్న సుశాంత్ మళ్ళీ కొత్త కథతో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో రాబోతున్నాడు. దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 27న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కింగ్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఆసక్తి నెలకొలుపుతుంది.

సుశాంత్ బైక్ పై దెబ్బలతో వెళ్తున్న షాట్ తో “అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ ? అమ్మకి ఏం జరిగింది ? పులి ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ? నువ్వెందుకు రా పోలీసులను చూసి పారిపోతున్నావ్ ? అంటూ సుశాంత్ ని అడగడంతో మొదలైన ట్రైలర్ లో రొమాంటిక్ షాట్స్ , విజువల్స్ , మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా సినిమా కథని ఏమాత్రం దాచకుండా ట్రైలర్ లో చూపించేశాడు దర్శకుడు. కాకపోతే స్క్రీన్ ప్లే, ట్విస్టులు , క్లైమాక్స్ ఎలా ఉంటాయనేది మాత్రం స్క్రీన్ పై చూడాల్సిందే అంటూ హింట్ ఇచ్చాడు. ఈ సినిమాను కొన్ని యథార్థ సంఘటనల ఆదరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ విషయాన్ని ట్రైలర్ ఆరంభంలోనే చెప్పాడు.

సినిమాలో పెట్టకూడని చోట హీరో బైక్ పార్కింగ్ చేయడం అందువల్ల ఓ సమస్యలో ఇరుక్కోవడం చివరికి అందులో నుండి ఎలా బయట పడ్డాడు ? అనేది సినిమాలో ఆసక్తిగా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఫైనల్ గా ‘చిలసౌ’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరి తర్వాత సుశాంత్ నుండి ఓ ఎంగేజింగ్ థ్రిల్లర్ సినిమా రానుందని అనిపిస్తుంది. మరి టీజర్, ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన సుశాంత్ సినిమాతో పూర్తి స్థాయిలో మెప్పిస్తాడా ? తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టర్. AI స్టూడియోస్ , శాష్ట్ర మూవీస్ బేనర్స్ పై రవి శంకర్ శాస్త్రి , ఏక్తా శాస్త్రి , హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics