ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సుశాంత్ మూవీ లాంఛ్

Thursday,January 30,2020 - 01:10 by Z_CLU

ఇచ్చట వాహనములు నిలపరాదు.. సుశాంత్ కొత్త సినిమా టైటిల్ ఇది. అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ టైమ్ లోనే తన కొత్త సినిమా టైటిల్ ను కూడా ప్రకటించాడు ఈ అక్కినేని హీరో. ఈరోజు ఈ సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేశారు.

సుశాంత్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా లాంఛ్ అయింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో దర్శన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

లాంఛింగ్ కు ముందే టైటిల్ రిలీజ్ చేసిన మేకర్స్, ఈ రోజు ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సుశాంత్ బైక్ పార్క్ చేసి హెల్మెట్ తీసే స్టిల్ తో పాటు.. హీరోహీరోయిన్ల రొమాంటిక్ లుక్ తో మరో స్టిల్ కూడా రిలీజ్ చేశారు.

శాస్త్ర మూవీస్ బ్యానర్ పై రవిశంకర్ శాస్త్రి, హరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఒకప్పుడు హీరోగా నటించిన వెంకట్, ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.