ఆ మేటర్ లో నిజం లేదు

Sunday,April 19,2020 - 02:03 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ ఓ నెగిటివ్ రోల్ చేస్తున్నాడనే రూమర్ హల్ చల్ చేసింది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు గోపీచంద్. తను రజనీకాంత్ సినిమాలో నటిస్తున్నాననే మేటర్ లో నిజం లేదంటున్నాడు.

దర్శకుడు శివ గతంలో తనతో సినిమాలు చేయడం వల్లే ఈ రూమర్ పుట్టిందంటున్నాడు గోపీచంద్.

ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న ‘సీటీమార్’ కి సంబంధించి యాబై శాతం షూటింగ్ పూర్తయిందని తెలిపాడు.

ఇక డైరక్టర్ తేజతో ఎప్పటి నుండో ఓ సినిమా అనుకుంటున్నాను. ఇటీవలే ఆయన ‘అలివేలు మంగ వెంకటరత్నం’ అనే కథ చెప్పారు. బాగా నచ్చింది త్వరలోనే ఆ సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్.