ఆడనంటున్న శ్రీకాంత్ కొడుకు

Friday,September 16,2016 - 10:23 by Z_CLU

 శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమైన నిర్మలా కాన్వెంట్ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు శ్రీకాంత్ ఫ్యామిలీ భారీ ప్రచారం కల్పిస్తోంది. మరోవైపు నాగార్జున కూడా సినిమా కోసం చేయాల్సిందంతా చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా… తండ్రి శ్రీకాంత్ కు సంబంధించి రోషన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను మీడియాతో పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా నాన్న క్రికెట్ అంటే తనకు అస్సలు నచ్చదని కరాఖండిగా చెప్పేశాడు. అసలు తనకు సీసీఎల్ అంటేనే నచ్చదని, భవిష్యత్తులో నాన్నతో కలిసి క్రికెట్ ఆడే అవకాశం మ్యాగ్జిమమ్ ఉండకపోవచ్చని రోషన్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు తన కెరీర్ కు సంబంధించి కూడా పక్కా క్లారిటీతో ఉన్నాడు రోషన్. నిర్మలా కాన్వెంట్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ… సినిమాలకు సంబంధించి రెండేళ్లు గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. చదువు పూర్తిచేసిన తర్వాత, మళ్లీ సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నాడు రోషన్.