ఈసారి గట్టిగా కొడుతున్నాం

Thursday,July 06,2017 - 11:10 by Z_CLU

కృష్ణవంశీ దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన నక్షత్రం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను నిన్న గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా పాటల్ని భారీ హంగామా మధ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణవంశీ.. ఈసారి ఎవర్నీ డిసప్పాయింట్ చేయనని ప్రకటించాడు.

నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. సాయిధరమ్ తేజ ఓ కీలక పాత్ర పోషించాడు. రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లు. ఓ కీలక పాత్రలో పూనమ్ కౌర్, ఐటెంసాంగ్ లో శ్రియ నటించారు. ఇంతమంది భారీ తారాగణంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు కృష్ణవంశీ.

ఆడియో ఫంక్షన్ కు కొన్ని గంటల ముందు థియేట్రికల్ ట్రయిలర్ ను లాంచ్ చేశారు. కృష్ణవంశీ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది ఆ ట్రయిలర్ లో. అన్ని హంగులతో ముస్తాబైన నక్షత్రం సినిమా ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయనుంది.