ఈ సినిమాలో అందరినీ ఏడిపించేస్తా...

Tuesday,November 14,2017 - 10:03 by Z_CLU

‘మహానుభావుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత మారుతి నిర్మించిన ‘లండన్ బాబులు’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. హిలేరియస్ ఎలిమెంట్స్ తో  హార్ట్ టచింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ధనరాజ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.

ధనరాజ్  తన క్యారెక్టర్ గురించి చెప్తూ… “ఈ సినిమాలో నేనో నక్సలైట్ గా నటించాను. సినిమా మొత్తం తన వారి కోసం వెదుకుతూనే ఉండే క్యారెక్టర్, చివరికి తన వాళ్ళు దొరక్కుండానే మధ్యలో చనిపోతాను. చిన్నికృష్ణ ప్రతి సిచ్యువేషన్ ని అద్భుతంగా తెరకెక్కించాడు. బిగినింగ్ నుండి నవ్విస్తూ ఉండి చివరికి అందరినీ ఏడిపించేస్తా ఈ సినిమాలో…” అని చెప్పుకున్నాడు ధనరాజ్.

అద్భతమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో హిలేరియస్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిన్నికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కింది. తమిళ బ్లాక్ బస్టర్ ‘ఆండవాన్ కట్టలై’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అక్కడక్కడా నేటివిటీకి తగ్గట్టు మార్పులకు చేర్పులు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో స్వాతి రిపోర్టర్ గా కనిపించనుంది.