CHIRANJEEVI మెగాఫోన్ పట్టబోతున్న మెగాస్టార్
Wednesday,April 27,2022 - 11:03 by Z_CLU
I will direct a film soon said MegaStar Chiranjeevi in Recent Interview
150 సినిమాలకు పైగా నటించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన అనంతరం మెగా స్టార్ మెగా ఫోన్ పట్టబోతున్నారట. మరో రెండ్రోజుల్లో ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న చిరు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
” డైరెక్షన్ చేయడం అనేది నా డ్రీమ్స్ లో ఒకటి. కచ్చితంగా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. అదెప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం నా ఫోకస్ యాక్టింగ్ మీదే ఉంది. ఎక్కువ సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. ” అన్నారు చిరు.
ఇక రాజమౌళితో సినిమా అనే న్యూస్ గురించి కూడా స్పందించారు మెగాస్టార్. “అందులో నిజం లేదు. ఒక వేళ రాజమౌళి నాతో సినిమా చేయాలనుకున్నా నేను చేయనని చెప్తాను. ఎందుకంటే నటుడిగా రాజమౌళి ని సాటిస్ఫై చేయలేను. యంగ్ హీరోల్లా ఎక్కువ కష్టపడలేను కాబట్టి రాజమౌళితో సినిమా చేయలేను” అంటూ చెప్పుకున్నారు చిరు. ఇక త్వరలోనే హైదరాబాద్ లో పది పడకలతో ఓ హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నట్లు మెగా స్టార్ తెలిపారు.
-
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics