లాయర్ అవుదాం అనుకున్నాను

Monday,May 18,2020 - 04:05 by Z_CLU

డాక్టర్ అవుదామనుకొని యాక్టర్ అయ్యానని చాలామంది చెబుతుంటారు. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఇదే టైపు. ఆమె లాయర్ అవుదామనుకుందట. ఈ లాక్ డౌన్ టైమ్ లో నెజిటన్లతో ఛాట్ చేసిన ఈ బ్యూటీ.. ఈ విషయాన్ని బయటపెట్టింది.

“యాక్టింగ్ అస్సలు నా మైండ్ లో లేదు. కాలేజ్ డేస్ లో మోడలింగ్ చేసే వరకు, నన్ను అంతా అందంగా ఉన్నావని చెప్పేవరకు నాకు గ్లామర్ ఫీల్డ్ లోకి రావాలనే ఆలోచన లేదు. ఎప్పుడైతే సరదాగా మోడలింగ్ చేశానో, అప్పట్నుంచి యాక్టింగ్ పై కోరిక పెరిగింది. అలా హీరోయిన్ అయిపోయాను. లేదంటే మంచి లాయర్ అవుదామనుకున్నాను నేను.”

ఇలా తన మనసులో మాట బయటపెట్టింది ప్రగ్యాజైశ్వాల్. ఈ లాక్ డౌన్ టైమ్ లో అందర్లానే తను కూడా ఇంట్లోనే ఉన్నానని, కాకపోతే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తున్నానని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా బనానా చాక్లెట్ కేక్ తయారుచేయడం కూడా నేర్చుకున్నానంటోంది.