తారక్ తో చేయాలన్నది నా డ్రీం

Monday,January 28,2019 - 04:12 by Z_CLU

‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి లేటెస్ట్ గా అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో హంగామా చేస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు వెంకీ అట్లూరి. ఇక తన స్నేహితుడు ఎన్.టి.ఆర్ తో సినిమాపై కూడా స్పందించాడు ఈ యంగ్ డైరెక్టర్.

ఇండస్ట్రీలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో తారక్ ఒకరు. తను తొలిప్రేమ చూసిన తర్వాత ఆ సినిమా గురించి నాతో పెద్దగా మాట్లాడలేదు. కాని ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ మూడు వేల మంది ముందు నా గురించి మాట్లాడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు.

“తారక్ తో సినిమా చేయాలనేది నా డ్రీం. కాకపోతే తారక్ ని డైరెక్ట్ చేయాలంటే దర్శకుడిగా నాకు ఇంకొంత అనుభవం కావాలి. ఆ అనుభవం వచ్చిన రోజు ఖచ్చితంగా తారక్ తో సినిమా చేస్తా.. అది తొందర్లోనే జరగాలని కోరుకుంటున్నా అన్నాడు. మరి తన మిత్రుడు తారక్ ని డైరెక్ట్ చేసే చాన్స్ వెంకీ కెప్పుడొస్తుందో..? చూడాలి.