నేను బలంగా నమ్మాను - గోపి చంద్ మలినేని

Tuesday,January 19,2021 - 02:09 by Z_CLU

సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్న ‘క్రాక్’ సక్సెస్ గురించి తాజాగా మీడియాతో పంచుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…!

గట్టిగా నమ్మాను

లాక్సి డౌన్ లో సినిమాను OTT కి ఇవ్వమని అడిగారు. కానీ నాకు సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఉండేది. నేను రాసుకున్న , తీసిన సన్నివేశాలను ప్రేక్షకులు థియేటర్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకో క్లారిటీ ఉంది. అందుకే OTT రిలీజ్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతుంటే ‘క్రాక్ ఇన్ థియేటర్స్ ఓన్లీ’ అని ట్వీట్ చేశా. ఇప్పుడు థియేటర్స్ మాస్ సన్నివేశాలకు వస్తున్న రెస్పాన్స్ ను నేను ముందే ఊహించాను.

ఆ నరకం ఎవరూ పడకూడదు

రిలీజ్ రోజు ముందు రాత్రి సమస్య గురించి తెలిసింది. కానీ తెల్లవారే సరికి అంతా సెట్ అవుతుందనుకున్నా… కానీ అవ్వలేదు. జనాలు భారీ సంఖ్యలో థియేటర్స్ కి రావడం చూసి సంతోష పడాలో సినిమా రిలీజ్ కానందుకు బాధ పడాలో అర్థం కాలేదు. ముందు రోజు రాత్రి నుండి రిలీజ్ రోజు రాత్రి షో పడే వరకు నరకం చూశాను. ఆ బాధ ఏ దర్శకుడికి రాకూడదని కోరుకుంటున్నాను.

ఇండస్ట్రీ సపోర్ట్ మరవలేను

రిలీజ్ ఆగిందని తెలిసిన వెంటనే చాలా మంది దర్శకులు , హీరోలు , నిర్మాతలు నాకు ఫోన్ చేసి దైర్యం చెప్పారు.  వినాయక్ గారు, త్రివిక్రమ్ గారు ,  వంశీ పైడిపల్లి గారు,  మంచు మనోజ్, సాయి ధరం తేజ్ , నిర్మాత NV ప్రసాద్ గారు, నిర్మాత నాగ వంశీ ఇలా చాలా  మంది నాకు ఫోన్ చేసి వారి మాటలతో నాకు మంచి సపోర్ట్ అందించారు.

ట్వీట్ చేయాలనిపించిందఅన్నారు

రామ్ చరణ్ గారు కాల్ చేసి సినిమా చూడగానే ట్వీట్ చేయాలనిపించింది. చాలా బాగా తీసారు. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయి అని చెప్తూ చాలా సేపు మాట్లాడారు.

మా అబ్బాయి ని టూర్ తీసుకెళ్ళాలి

సినిమాలో మా అబ్బాయి నటన కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలియకుండా చూశాను. కానీ వాడిలో నీ పోలికలు చూసి గుర్తుపట్టాను అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారికి వాడి నటన బాగా నచ్చింది. ఇప్పుడు వాడు నన్ను ఏదైనా టూర్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు.

మెగా కాంప్లిమెంట్స్ బూస్టప్ ఇచ్చింది

మెగా స్టార్ చిరంజీవి గారు సినిమా చూసి చాలా సేపు మాట్లాడారు.  ఒకసారి ఇంటికి వచ్చి కలవమని చెప్పారు. ఆయనని కలవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. మెగా కాంప్లిమెంట్స్ నాకు మంచి బూస్టప్ ఇచ్చింది.

అప్పటికప్పుడు షూటింగ్ కొచ్చాడు 

సినిమాలో అంకడు క్యారెక్టర్ ని స్టంట్ శివ తో చేయిస్తే బాగుంటుందనుకున్నా. వెంటనే తనకి ఫోన్ చేశా. తను స్టంట్స్ చేస్తున్న  సినిమా షూటింగ్ ప్యాకప్ అవ్వగానే డైరెక్ట్ గా క్రాక్ షూటింగ్ కొచ్చాడు. అసలు మేటర్ చెప్పి పది నిమిషాలు నరేషన్ ఇచ్చాను. నేను ఊహించినట్టే చాలా బాగా చేసాడు. కఠారి కృష్ణ , జయమ్మ పాత్రల తర్వాత  అంకడు రోల్ కూడా బాగా రిజిస్టర్ అయ్యింది.

అలా జరగదని చూపించాలనుకున్నా

మాస్ యాక్షన్ సినిమాల్లో ఎప్పుడూ విలన్స్ … హీరో ఫ్యామిలీలో ఎవరో ఒకరిని చంపడం కామన్. అందుకే ఆ లీడ్ తీసుకొని అలా జరగదు అని చూపిద్దామనుకున్నాను. అందరు అక్కడ ఏదో ఊహించారు. కానీ నేను రాసుకున్నది వేరు. శృతి హాసన్ ఫైట్ చేసే యాక్షన్ ఎపిసోడ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఊహించినట్టు ఉంది.

200 పర్సెంట్ హ్యాపీ 

దర్శకుడిగా క్రాక్ నాకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు బాధ్యత ఇంకా పెంచింది. ఈ సినిమా విషయంలో నేను 200 పర్సెంట్ హ్యాపీ. త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నా తదుపరి సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుంది. క్రాక్ హిందీకి అడుగుతున్నారు. క్యాస్టింగ్ తో పాటు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే అక్కడ కూడా డైరెక్ట్ చేస్తా.