జెన్యూన్ గా చేసిన సినిమా మెహబూబా – పూరి జగన్నాథ్

Monday,April 23,2018 - 04:07 by Z_CLU

మే 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మెహబూబా’. పూరి ఆకాష్ ని ఈ సినిమాతో ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్నాడు పూరి. అయితే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి ఇమోషనల్ గా మాట్లాడాడు దర్శకుడు పూరి జగన్నాథ్.

“ఇప్పటి వరకు నేను సినిమాలు మైండ్ తో చేశాను. జెన్యూన్ గా చేసిన సినిమా మెహబూబా. సినిమా చూడగానే దిల్ రాజు గారు ఒకటే మాట అన్నారు. ‘నువ్వు మనసు పెట్టి తీస్తే సినిమా ఇలా ఉంటుంది. నీ కరియర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్’ అని దిల్ రాజు గారు ఆ మాటనగానే చాలా ధైర్యం వచ్చేసింది. ఆయన జడ్జ్ మెంట్ లో ఎప్పుడూ తేడా ఉండదు. ఈ సినిమా ఆయన రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాప్పీగా ఉంది.” అన్నాడు పూరి.

సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పూరి ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్.