నా కెరీర్ లో కూడా ఆర్ఎక్స్100 ఉంది: సునీల్

Tuesday,September 04,2018 - 01:01 by Z_CLU

అప్పట్లో తను హీరోగా నటించిన సినిమాను ‘ఆర్ ఎక్స్ 100’ రేంజ్ హిట్ తో పోలుస్తూ ఆ విషయాన్ని ఎప్పుడు పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు సునీల్.. ‘సిల్లీ ఫెలోస్’ సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన సునీల్.. తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

తను మొదటిసారి హీరోగా నటించిన ‘అందాలరాముడు’ సినిమా ఇప్పటి ‘RX 100’ హిట్ రేంజ్ తో సమానమని, ఇప్పటి కలెక్షన్స్ తో పోలిస్తే అప్పట్లో ‘అందాల రాముడు’ది ఆర్ఎక్స్100’ రేంజ్ అని అంటున్నాడు. కానీ అంతటి హిట్ తర్వాత కూడా తను కమెడియన్ గానే కొనసాగానని.. హీరోగా ఇరగదీసేయాలనే కోరిక తనకు ఎప్పుడూ లేదని అంటున్నాడు సునీల్.

‘మర్యాద రామన్న’ సినిమా తర్వాత మాత్రమే హీరోగా కొన్ని సినిమాలు కమిట్ అయ్యానని, అలా హీరోగా నటించాల్సి వచ్చిందే తప్ప, తన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం కామెడీ పాత్రలకేనని చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీదు సునీల్ మళ్లీ కామెడీ ట్రాక్ లోకి రావడంతో, చాలా మంది ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.