మేడ మీద అబ్బాయితో స్టయిల్ మార్చాను: అల్లరి నరేష్

Tuesday,September 05,2017 - 01:30 by Z_CLU

మేడమీద అబ్బాయి సినిమాతో నా ట్రాక్ మార్చాను. ఈ సినిమా తర్వాత విభిన్నమైన కథాంశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకముంది అని అన్నారు అల్లరి నరేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మేడమీద అబ్బాయి. శ్రీమతి నీలిమ సమర్పణలో జాహ్నవి ఫిల్మ్స్  పతాకంపై బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రజీత్  దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. ఈ నెల 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. “హాస్యనటుడు కృష్ణభగవాన్ సూచించిన ఈ టైటిల్‌ను 2012లో రిజిస్టర్ చేయించాను. అప్పటినుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. నాని, నేను ఎప్పుడు కలిసిన సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. నీలో మంచి  నటుడు ఉన్నాడు కామెడీ మాత్రమే కాకుండా కొత్తగా ప్రయత్నించమని,  గమ్యం లాంటి సినిమాల్లో నటించమని నాని చెబుతుంటాడు. చాలా రోజుల తర్వాత అప్పుడు చెప్పిన మాటను గుర్తుంచుకొని మేడమీద అబ్బాయి చేశాను.”