‘కణం’ దర్శకుడి మనసులో మాట

Tuesday,April 24,2018 - 08:20 by Z_CLU

సాయి పల్లవి, నాగశౌర్య జంటగా నటించిన ‘కణం’ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. అయితే ఈ  సినిమా దర్శకుడు A.L. విజయ్ తెలుగు ఆడియెన్స్ గురించి ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాట చెప్పుకున్నాడు.

“తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారు. నాకు తెలుగు సినిమా ఆడియెన్స్ తో పర్సనల్ రిలేషన్ షిప్ ఉందనిపిస్తుంది. నన్ను ఇప్పటికీ టాలీవుడ్ లో ‘నాన్న’ సినిమా డైరెక్టర్ గా గుర్తిస్తారు. ‘కణం’ సినిమా కూడా ఇమోషనల్ గా ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ” అని చెప్పుకున్నాడు A.L. విజయ్.

 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో బేబీ వెరోనికా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాకి C. శ్యామ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఏప్రిల్ 27 న ఈ సినిమా రిలీజవుతుంది.