వరుస పర్యటనలు

Tuesday,October 04,2016 - 05:23 by Z_CLU

తన సినిమా ప్రమోషన్ కు సంబంధించి ఎప్పుడూ స్పెషల్ కేర్ తీసుకోవడం రామ్ కు అలవాటు. ఈసారి హైపర్ విషయంలో ఆ కేర్ ఇంకాస్త ఎక్కువైంది. ఎందుకంటే… హైపర్ మూవీకి ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. తన మనసుకు బాగా దగ్గరైన ఈ సినిమాకు మరింత ఎక్కువ ప్రచారం చేయాలనుకున్నాడు రామ్. పైగా దసరా సీజన్ కూడా కావడంతో… కలెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రత్యేకంగా టూర్ ప్లాన్ చేశాడు.

hyper-still-002-1

     ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని థియేటర్లు కవర్ చేశాడు. తాజాగా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పట్టణాల్లో కూడా పర్యటించాడు. అన్ని జిల్లాల నుంచి హైపర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. చాలా ఆనందంగా ఉందంటున్న రామ్… త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా సుడిగాలి పర్యటనలు చేపడతానని ప్రకటించాడు.