హైపర్ రిపోర్ట్

Tuesday,September 27,2016 - 02:11 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘హైపర్’ ఈ నెల 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డ్ సినిమాకు U / A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా… సినిమాకు సంబంధించిన ఇన్ సైడ్ టాక్.. హైపర్ పై మరింత హైప్ పెంచింది. సెన్సార్ రిపోర్ట్ తో పాటు ఇన్ సైడ్ టాక్ ప్రకారం… హైపర్ సినిమా సూపర్ హిట్ అనే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కందిరీగ తరవాత సంతోష్ శ్రీనివాస్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో బిగినింగ్ నుంచే సినిమా పట్ల అంచనాలు భారీగా ఉన్నాయి. సరికొత్త కథాంశంతో ఫాదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా నటించగా అనిల్ సుంకర, రామ్ ఆచంట,గోపి ఆచంట ఈ సినిమాని నిర్మించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు. రామ్-రాశి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.