హీరో రామ్ కు ఎనర్జిటిక్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్టే ప్రతి సినిమాలో ఫుల్ ఎనర్జీతో కనిపిస్తాడు ఈ కుర్రహీరో. రీసెంట్ గా జరిగిన హైపర్ ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు సుకుమార్ కూడా ఇదే విషయం చెప్పాడు. జగడం సినిమాలో రామ్ ఎలా ఉన్నాడో… ఇప్పటికీ అంతే ఎనర్జీ అతడిలో కనిపిస్తోందని మెచ్చుకున్నాడు. రామ్ ఎనర్జీకి తగ్గట్టే హైపర్ సాంగ్స్ కూడా అంతే ఎనర్జీతో ఉన్నాయి.
ఇప్పటికే తన మ్యూజిక్ తో మేజిక్ చేసిన జిబ్రాన్… హైపర్ సినిమాకు సంగీతం అందించాడు. రామ్ ఎనర్జీకి ఏమాత్రం తగ్గని రేంజ్ లో హైపర్ సాంగ్స్ కంపోజిషన్ ఉంది. దానికి తగ్గట్టే పిక్చరైజేషన్ కూడా జబర్దస్త్ గా ఉంది. మరీ ముఖ్యంగా బేబీ డాల్ అనే సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది.
బేబీ డాల్ సాంగ్ తో పాటు… హైపర్ లోని అన్ని సాంగ్స్ ప్రస్తుతం చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. కేవలం ఆడియోను మాత్రమే విడుదల చేయకుండా… ఫర్ ఎ ఛేంజ్… వీడియో సాంగ్ బిట్స్ ను కూడా విడుదల చేయడం హైపర్ కు పెద్ద ప్లస్ అయింది.
జిబ్రాన్ మ్యూజిక్ ను వినడంతో పాటు అందమైన లొకేషన్లలో రామ్-రాశిఖన్నా ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలా దశలవారిగా విడుదల అయిన పాటలు ప్రస్తుతం కుర్రాళ్లను మైమరిపిస్తున్నాయి. సినిమాపై హైప్ ను డబుల్ చేశాయి.