బాలీవుడ్ లో బిజీ అవుతున్న హైదరాబాద్ బ్యూటీ

Sunday,November 22,2020 - 03:40 by Z_CLU

పక్కా హైదరాబాద్‌ అమ్మాయి, సికింద్రాబాద్‌ శివశివాని పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న అమ్రిన్‌ ఖురేషి ఒకేసారి రెండు హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం అనేది ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ అయింది.

Amrin Qureshi

ఈ రెండు హిందీ చిత్రాలు తెలుగులో సూపర్‌హిట్‌ అయిన ‘సినిమా చూపిస్త మావ’, ‘జులాయి’ రీమేక్స్‌ కావడం విశేషం. ఇటు గ్లామర్‌ రోల్స్‌కి, అటు ట్రెడిషనల్‌ క్యారెక్టర్స్‌కి సూట్‌ అయ్యే అమ్రిన్‌కి బ్రైట్‌ ఫ్యూచర్‌ ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

Amrin Qureshi అమ్రిన్ ఖురేషి

హిందీ చిత్రాలు నిర్మాణంలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో భారీ చిత్రాల్లో అమ్రిన్‌ ఖురేషికి ఆఫర్స్‌ రావడం చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతోంది. హిందీ చిత్రాల్లో విజయాలు సాధించి తెలుగు, తమిళ్‌తోపాటు అన్ని సౌత్‌ లాంగ్వేజెస్‌లో హీరోయిన్‌గా విజయాలు సాధించాలన్నది అమ్రిన్‌ లక్ష్యం.

Amrin Qureshi అమ్రిన్ ఖురేషి

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ల విషయంలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌కి భిన్నంగా హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Amrin Qureshi అమ్రిన్ ఖురేషి

 

‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌’ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ సాజిద్‌ ఖురేషి కుమార్తె, రాయల్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత ఎమ్‌.ఐ.ఖురేషి మనవరాలు అమ్రిన్‌ ఖురేషి.