'హుషారు' రిలీజ్ డేట్

Sunday,December 02,2018 - 09:50 by Z_CLU

మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్   ‘హుషారు’  రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.లక్కీ మీడియా బ్యానర్ పై   బెక్కం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 14 విడుదల కానుంది.

తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి ,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు. రాదన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.