ఇండియన్-2 కోసం "భారీ" ప్రయత్నం

Wednesday,March 21,2018 - 01:30 by Z_CLU

కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచాలపై తీసిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. స్వతంత్ర సమరయోధుడిగా కమల్ హాసన్ అదరగొట్టాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఇండియన్-2 పేరుతో రాబోతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ నిర్మాణం ప్రారంభమైంది.

శంకర్ సినిమాలంటేనే భారీగా ఉంటాయి. గ్రాఫిక్స్, సెట్స్ అన్నీ రిచ్ గా ఉంటాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 2.0 సినిమా కోసం కూడా చెన్నైలో భారీ సెట్ వేశాడు. ఇప్పుడు ఇండియన్-2 కోసం కూడా రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ రెడీ అవుతోంది. గతంలో శివాజీ సినిమా కోసం కూడా ఇక్కడ భారీ సెట్ వేశారు శంకర్.

లెక్క ప్రకారం ఇండియన్-2 సినిమాను దిల్ రాజు నిర్మించాలి. కానీ ఈ భారీ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. కమల్ హాసనే తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తూ నటించాలని అనుకుంటున్నాడట. 2.0 రిలీజ్ తర్వాత ఇండియన్-2పై ఓ ప్రకటన చేస్తాడు డైరక్టర్ శంకర్.