Nagarjuna Bangarraju - సోగ్గాడిపై భారీ అంచనాలు

Monday,January 10,2022 - 04:01 by Z_CLU

Huge expectations on Nagarjuna’s Bangarraju

ప్రతీ సంక్రాంతికి 3-4 బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయి. అయితే ఈ సంక్రాంతికి కూడా RRR , రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు పొంగల్ బరిలో నిలిచాయి. కానీ అనుకోని విధంగా అవి వాయిదా పడటంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో ఏకైక బడా సినిమాగా నిలిచింది ‘బంగార్రాజు’. కింగ్ నాగార్జున -యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇప్పటికే రిలీజైన కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఆల్బంలో సిద్ శ్రీరామ్ పాడిన “నాకోసం పుట్టావా నువ్వు” సాంగ్ వైరల్ అవుతోంది. అలాగే టీజర్ కూడా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా ఉంది. జనవరి 11న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

జనవరి 14న సంక్రాంతి పండుగ స్పెషల్ గా రిలీజ్ అవుతున్న ‘బంగార్రాజు’ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమనిపిస్తుంది . మరో బడా సినిమా పోటీ లేకపోవడంతో 100 కోట్ల గ్రాస్ రీచ్ అవ్వడం బంగార్రాజు కి సులువే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో యూత్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ పండుగ సినిమా ఈ ఏడాది భారీ విజయంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు అందుకోవడం మాత్రం పక్కా అనిపిస్తుంది.