బన్నీ , సుక్కు సినిమాకి భలే కలిసొచ్చింది

Tuesday,February 25,2020 - 11:13 by Z_CLU

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ తీస్తున్న సినిమా , ఇండస్ట్రీ హిట్ వచ్చాక అల్లు అర్జున్ చేస్తున్న సినిమా , ‘సరిలేరు నీకెవ్వరు’ , ‘భీష్మ’ వరుస సక్సెస్ లు అందుకున్న రష్మిక నటిస్తున్న సినిమా …. ఫైనల్ గా ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న సినిమా ఇదీ ప్రస్తుతం సుకుమార్ , బన్నీ సినిమాకు కలిసొచ్చిన అంశం. అవును ప్రీవియస్ సినిమాలు ఓ రేంజ్ లో కలెక్ట్ చేసి పెద్ద హిట్ అవ్వడంతో ఈ ముగ్గురు చేస్తున్న సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది.

నిజానికి ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు జస్ట్ సుక్కు ఒక్కడికే నాన్ బాహుబలి రికార్డు ఉంది. దీనికి బన్నీ గ్రాండ్ సక్సెస్ కూడా కలిసొచ్చింది. ‘అల వైకుంఠపురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకే రిలీజ్ కి ముందే సినిమా భారీ బిజినెస్ చేసే అవకాశం కనిపిస్తుంది.

ఇక సుక్కు-బన్నీ కి రష్మిక సక్సెస్ అదనంగా కలిసొచ్చింది. అవును అమ్మడు ఖాతాలో తాజాగా ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ , ఓ సూపర్ హిట్ వచ్చి చేరాయి. సో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న ‘AA20’వీటన్నిటినీ దాటి కలెక్ట్ చేసి ఈ ముగ్గురికి మరో మైల్ స్టోన్ మూవీ అవుతుందేమో చూడాలి.