Pawan Corona - ప్రస్తుత పరిస్థితేంటి?

Saturday,April 17,2021 - 02:42 by Z_CLU

ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా సోకింది. వారం రోజుల క్వారంటైన్ తర్వాత నెగెటివ్ వస్తుందని భావించిన పవన్ కు, అతడి అభిమానులకు నిరాశ తప్పలేదు. పాజిటివ్ అని తేలిన వెంటనే పవన్ కు అతడి ఫామ్ హౌజ్ లో ట్రీట్ మెంట్ స్టార్ట్ అయింది. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసి ఇవాళ్టికి రెండో రోజు.

గడిచిన 2 రోజులుగా పవన్ కు పూర్తిస్థాయిలో టెస్టులు చేశారు. అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. కాకపోతే ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరినట్టు డాక్టర్లు గుర్తించారు. అందుకే యాంటీ వైరల్ మందులతో ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. మరోవైపు ఆక్సిజన్ కూడా అందిస్తూ వచ్చారు.

pawan kalyan corona zeecinemalu 1

పవన్ కు ఈరోజు ఆక్సిజన్ తీసేశారు. ఆయన నార్మల్ గానే ఊపిరి పీల్చుకుంటున్నారు. ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని డాక్టర్లు కన్ ఫర్మ్ చేశారు. ప్రస్తుతం పవన్ కు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందిస్తున్నారు.

ఖమ్మంకు చెందిన సతీష్ అనే డాక్టర్ పవన్ తో ఫుల్ టైమ్ ఉండిపోయారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కు ట్రీట్ మెంట్ ఇవ్వడంతో ఆయన బాగా పాపులర్. పవన్ తో పాటు ఫామ్ హౌజ్ లో ఆయన ఉండిపోయారు. ఇక మిగతా అపోలో డాక్టర్స్ టీమ్ ప్రతిరోజూ ఫామ్ హౌజ్ కు వచ్చి పవన్ ను చూసి వెళ్తున్నారు.

పవన్ త్వరగా కోలుకోవాలంటూ ఇప్పటికే ఆయన అభిమానులు, టాలీవుడ్ అంతా సోషల్ మీడియాను తమ సందేశాలతో నింపేశారు. సూపర్ స్టార్ మహేష్ లాంటి హీరోలు పోస్టులు పెట్టడంతో పాటు పవన్ హెల్త్ కండిషన్ పై పర్సనల్ గా వాకబు చేస్తున్నారు. మరో 4 రోజులు మెడికేషన్ కొనసాగించిన తర్వాత పవన్ కు మరోసారి కరోనా టెస్ట్ చేస్తారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics