How Didi Saiee Manjrekar get MAJOR Chance
మేజర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్. ఇంతకీ ఈ అవకాశం ఈ బ్యూటీకి ఎలా వచ్చిందో తెలుసా? ఆ వివరాలు స్వయంగా సయీ మంజ్రేకర్ చెప్పుకొచ్చింది.
“నమ్రత మేడమ్ మా పేరెంట్స్ కి బాగా తెలుసు. నమ్రత గారు కాల్ చేసి మేజర్ లో రోల్ గురించి అమ్మకి చెప్పారు. మా నాన్నగారు ఈ సినిమా ఎలా అయినా నువ్వు చేయాలని చెప్పారు. తర్వాత శేష్ ని కలిశాం. ఆయన కథ చెప్పినపుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా చూసినప్పుడు దాని కంటే పది రెట్లు ఎమోషనల్ అయ్యాం. మేజర్ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం.”
ఇలా తనకు మేజర్ లో ఎలా అవకాశం వచ్చిందో వివరించింది సయీ. ఈ సినిమాలో 3 విభిన్నమైన పాత్రలు పోషించిందట సయీ. ఒక షేడ్ లో 16 ఏళ్ల స్కూల్ గర్ల్ గా, మరో షేడ్ లో సందీప్ భార్యగా, ఇంకో షేడ్ లో ఆర్కిటెక్ట్ గా కూడా కనిపిస్తుందట.

ఇలా తొలి సినిమాకే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం చాలా హ్యాపీగా ఉందంటోంది సయీ మంజ్రేకర్. మేజర్ సినిమాతో తనకు మంచి లాంఛింగ్ దొరికిందని అభిప్రాయపడుతోంది. ఈరోజు వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics