హాట్ టాపిక్ : పవన్ న్యూ లుక్

Sunday,March 15,2020 - 12:00 by Z_CLU

ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ‘వకీల్ సాబ్’ తో పాటు క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే క్రిష్ సినిమాలో పవన్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  సినిమాలో పవన్ ఓ చరిత్రగల వీరుడి ఓ పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర కోసమే లాంగ్ హెయిర్ తో క్లీన్ షేవ్ చేసుకొని పవర్ ఫుల్ మీసకట్టుతో ఓ లుక్ ట్రై చేసాడు.

పవన్ ఇప్పుడు ఆ లుక్ తోనే  బయటికొస్తుండటంతో పవర్ స్టార్ పవర్ ఫుల్ లుక్ హాట్ టాపిక్ అవుతుంది. ఎక్కడ చూసిన క్రిష్ సినిమాలో పవన్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. మరి తొలి సారి పవర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్న క్రిష్ తన సినిమాతో పవన్ ను ఎలాంటి పవర్ ఫుల్ లుక్ లో ప్రెజెంట్ చేస్తాడో ఎలాంటి గెటప్ లో చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.