Hot Topic : సుజీత్ దర్శకత్వంలో పవన్ సినిమా ?

Tuesday,March 01,2022 - 01:45 by Z_CLU

Hot Topic : Pawan Kalyan team-up with Sujeeth ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న పవన్ నెక్స్ట్ సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ నెక్స్ లిస్టులో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో ప్రాజెక్ట్ వచ్చి చేరిందనే టాక్ వినబడుతుంది. ఆ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ సుజీత్  పేరు చక్కర్లు కొడుతుంది.

ప్రెజెంట్ పవన్ లైనప్ లో రెండు మూడు రీమేక్స్ ఉన్నాయని తెలుస్తుంది. అందులో ‘తేరి’ సినిమా ఒకటి.  2016 లో వచ్చిన తమిళ్ సినిమా ఇది. విజయ్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. సినిమాలో హీరో పోలీస్. ఫ్యాన్స్ ని మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి.  ఇక పోలీస్ క్యారెక్టర్ తో రీమేక్ అంటే పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడని తెలిసిందే.  అందుకే ‘తేరి’ రీమేక్ కి పవన్ ఒకే చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోన్నాడని అంటున్నారు. ఈ సినిమాను డి.వీ.వీ.ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై దానయ్య నిర్మించానున్నాడని సమాచారం.

‘రన్ రాజా రన్’ తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ ‘సాహో’ తో తెలుగు ఆడియన్స్ ని నిరాశ పరిచాడు. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు పవన్ తో సినిమా అంటూ సుజీత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. మరి పవర్ స్టార్ తో సుజీత్ సినిమా అనేది నిజమేనా ? లేదంటే ఇది జస్ట్ రూమర్ ఆ ? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics