Hot Topic : విజయ్ సినిమాలో నాని ?

Saturday,February 26,2022 - 05:40 by Z_CLU

Hot Topic : Nani in Vijay -Vamsi’s Movie

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తమిళ్ , తెలుగు బైలింగ్వెల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. హీరో నాని విజయ్ సినిమాలో ఓ కీ రోల్ చేయబోతున్నాడనే టాక్ చక్కర్లు కొడుతుంది. నిజానికి కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ లో నాని పేరు వినిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ న్యూస్ సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతుంది.

ఇందులో నిజం లేకపోలేదు. వంశీ పైడిపల్లి తెలుగు డైరెక్టర్. ఇప్పుడు విజయ్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి నిర్మాత దిల్ రాజు. ఎక్కువ శాతం తెలుగు టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నారు. విజయ్ తెలుగులో చేస్తున్న స్ట్రైట్ సినిమా ఇది. అందుకే తెలుగు యాక్టర్స్ ని కూడా పెట్టాలని చూస్తున్నారు. ఇందులో ఓ యంగ్ హీరో తో చేయించే క్యారెక్టర్ కూడా ఉందట. అందుకే మేకర్స్ నానికి  స్క్రిప్ట్ చెప్పి లాక్ చేసుకున్నారని అంటున్నారు.

ప్రస్తుతానికి ఈ న్యూస్ పై మేకర్స్ స్పందించలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కూడా. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అనే సమేత ఈ న్యూస్ కి కూడా వర్తిస్తుందేమో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. ప్రస్తుతానికి  విజయ్ – నాని  కాంబో వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics