హాట్ టాపిక్ : మహేష్ సినిమా కథ ఇదేనా?

Tuesday,June 02,2020 - 02:20 by Z_CLU

జస్ట్ ఒక పోస్టర్ వదిలితే చాలు దాని చుట్టూ కథ అల్లేసే పనిలో ఉంటారు అభిమానులు. సరిగ్గా ఇప్పుడు మహేష్ సినిమాకు అదే జరుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేష్ నెక్స్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ టైటిల్ తో ఓ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

ప్రీ లుక్ లో మహేష్ లుక్ పై బజ్ క్రియేట్ అయ్యేలా కొన్ని హింట్స్ ఇచ్చారు. ప్రీ లుక్ పోస్టర్ లో మహేష్ మెడ మీద రూపాయి బిళ్ళ టాటూ , చెవి పోగు, లాంగ్ హెయిర్ , లైట్ గెడ్డం ఇవన్నీ అభిమానుల్ని ఎట్రాక్ట్ చేసాయి.

కానీ లుక్ ను వదిలేసి చాలా మంది ఈ సినిమా కథ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒకడుగు ముందుకేసి ఇదే కథ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చిన్నతనంలో మహేష్ ఇల్లును సర్కారు వేలం పాట వేస్తారని పెరిగి పెద్దయ్యాక మళ్ళీ మహేష్ ఆ ఇల్లును సొంతం చేసుకుంటాడని ఇలా ఎవరికీ తోచిన స్టోరీ వాళ్ళు అల్లేస్తూ పోస్టులు పెట్టేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం.. మహేష్ తండ్రి బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తాడని, ఓ బడా బిజినెస్ మేన్ ఆ బ్యాంక్ కు చెల్లించాల్సిన రుణాన్ని ఎగ్గొడితే, మహేష్ వెళ్లి వందల కోట్ల రూపాయల్ని తిరిగి ఎలా రికవరీ చేశాడనే స్టోరీతో సర్కారు వారి పాట సినిమా వస్తోందని అంటున్నారు. 

ఇలా ‘సర్కారు వారి పాట’ సినిమా కథకు సంబంధించి చాలా డిస్కషన్ నడుస్తుంది. ఏదేమైనా ప్రీ లుక్ పోస్టర్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేసి హాట్ టాపిక్ అవ్వడంతో సినిమా యూనిట్ సక్సెస్ అయింది.