జనవరి గడిచిపోయింది. రిజొల్యూషన్స్, హోప్స్ జస్ట్ జనవరికే కాదు మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫిబ్రవరిని కూడా అదే క్రేజ్ తో ట్రీట్ చేస్తున్నారు. ఈ నెలలో రిలీజ్ కానున్న తమ క్రేజీ ప్రాజెక్ట్స్ తో కరియర్ ని ఫాస్ట్ పేజ్ లోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్న స్టార్ హీరోయిన్స్ ఫిబ్రవరి పై భారీ హోప్స్ పెట్టుకుని ఉన్నారు.
మజ్ను సినిమాతో నాని సరసన న్యాచురల్ ఎంట్రీ ఇచ్చిన అను ఇమాన్యువేల్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. ఫిబ్రవరి 17 న రిలీజ్ కానున్న ఈ సినిమా అను ఇమ్మాన్యువెల్ ని ఏ ప్లేస్ లో నిలబడుతుందో చూడాలి.
నేను శైలజ సినిమాతో డీసెంట్ ఎంట్రీ తో పాటు డీసెంట్ హిట్ ని కూడా బ్యాగ్ లో వేసుకున్న కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమా హిట్ అవ్వడంతో, మరింత క్రేజీ హీరోయిన్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ స్టేజ్ ని లోకల్ ప్లాట్ ఫాం గా మార్చుకోవాలనుకుంటున్న కీర్తి, ఈ సినిమా సక్సెస్ తో కరియర్ ఏ టర్న్ తీసుకోనుందో చూడాలి.
కంచె సినిమాతో ఎట్రాక్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్ సినిమాతోనే మ్యాగ్జిమం మార్కులు బ్యాగ్ లో వేసేసుకుంది. అఫ్ కోర్స్ ఆ మార్కులు ప్రగ్యాని మరీ టాలీవుడ్ నం1 స్టార్ హీరోయిన్ ప్లేస్ లో నిలపకపోయినా, ఆ రేస్ కి మాత్రం క్వాలిఫై చేసింది. ఎలాగోలా టాలీవుడ్ లో పర్మనెంట్ ప్లేస్ ని టార్గెట్ చేసిన ప్రగ్యా, ఫిబ్రవరి లో రిలీజ్ కానున్న ఓం నమో వెంకటేశాయతో పాటు, గుంటూరోడు సినిమాల పై భారీ హోప్స్ పెట్టుకుంది. మరి ప్రగ్యా హోప్స్ రియాలిటీ లోకి ట్రాన్స్ ఫాం అవుతాయో లేదో చూడాలి.
హిస్టారికల్ ఎలిమెంట్స్ తో అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఘాజి సినిమాతో మరోసారి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న తాప్సీ కరియర్ లో కూడా ఫిబ్రవరి చాలా చేంజెస్ తీసుకురానుంది. ఘాజి సినిమా ఎక్స్ పెక్ట్ చేసిన హిట్టయితే తాప్సీ టాలీవుడ్ లో మ్యాగ్జిమం సెటిల్ అయిపోయే చాన్సెస్ అయితే ఉన్నాయి. మరి తాప్సీ లక్ బుక్ లో ఏం రాసి పెట్టి ఉందో ఘాజీ రిలీజయితే కానీ తెలీదు.