ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్

Saturday,February 04,2017 - 06:06 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో నటించ బోయే  27వ సినిమాకి సంబంధించి మరో గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేశారు యూనిట్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ గా రాశి ఖన్నా ను అనౌన్స్ చేసిన టీం లెటస్ట్ గా హాలీవుడ్ టెక్నీషియన్ ప్రొస్థెటిక్స్  & లెగసీ  ఎఫ్.ఎక్స్ ఎక్స్పర్ట్  వన్స్ హార్ట్వెల్ ఈ సినిమాకు పని చేయబోతున్నాడని అనౌన్స్ చేసారు.

ntr27-technicien

 

ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా లో యంగ్ టైగర్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. ఈ మూడు క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని అందుకే ఈ హాలీవుడ్ మేకప్ మెన్ ను ఈ సినిమాకు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘లార్డ్ అఫ్ ది రింగ్స్’, ‘ఐరన్ మాన్’,’లైట్ అఫ్ పై’,’రోబో’ వంటి ఎన్నో ప్రెస్టీజియస్ సినిమాలకు పనిచేసిన ఈ టాప్ హాలీవుడ్ టెక్నీషియన్ ఈ సినిమాకు మరింత ప్లస్ అవ్వనున్నాడనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు యూనిట్. ఫిబ్రవరి 10న పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.