నితిన్ సినిమాలో హాలీవుడ్ స్టార్

Wednesday,April 19,2017 - 01:29 by Z_CLU

LIE- టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేశాడు నితిన్. టైటిల్ తో పాటే రిలీజైన వారం రోజుల పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన ఫస్ట్ లుక్స్, ఏదైతేనేం నితిన్ సెట్స్ పై ఉండగానే సినిమా పట్ల పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు డాన్ బిల్జారియేన్ నటించడం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలుస్తుంది.  సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఏదో టాపిక్ తో అప్ డేటెడ్ గా ఉంటున్న సినిమా యూనిట్, ఈ రోజు ఈ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది టీమ్.

మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.