రానా సినిమాలో హాలీవుడ్ హీరోయిన్

Saturday,July 29,2017 - 02:20 by Z_CLU

రెగ్యులర్ స్టార్ హీరోలతో పోలిస్తే డిఫెరెంట్ గా కరియర్ ని ప్లాన్ చేసుకున్నాడు రానా.  క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కానీ, ఎంత కష్టమైనా ప్రిపేర్ అవుతాడు, ఎంత టైమైనా కేటాయిస్తాడు. అందుకే రానా  ఏకంగా లండన్ డిజిటల్ మూవీ అండ్ టి.వి. స్టూడియోస్ నిర్మిస్తున్న లండన్ బేస్డ్ సినిమాలో చాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాలో రానాతో హాలీవుడ్ హీరోయిన్ జత కట్టనుంది.

2018 లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. బాహుబలి ఘాజి సినిమాలతో వార్ స్టార్ అనిపించుకున్న రానా, ఈ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా షైన్ అవ్వడం గ్యారంటీ అంటున్నాయి సోర్సెస్.