ఆర్-ఆర్-ఆర్... ఇది మరో గాసిప్

Saturday,February 09,2019 - 01:45 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాకు సంబంధించి రోజుకో గాసిప్ గుప్పుమంటోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి వస్తున్న రూమర్స్ అన్నీ ఇన్నీ కావు. ఒకరేమో కైరా అద్వానీ అంటారు, మరొకరు అలియా భట్ అంటారు. తాజాగా ఇప్పుడీ పుకార్లు హాలీవుడ్ రేంజ్ కు వెళ్లాయి.

అవును.. సినిమా కథ ప్రకారం ఆర్-ఆర్-ఆర్ మూవీకి ఓ ఫారిన్ గర్ల్ కావాలంట. ఎన్టీఆర్ సరసన ఈ విదేశీ అమ్మాయి నటిస్తుందట. రామ్ చరణ్ సరసన అలియాభట్ కోసం ప్రయత్నిస్తున్న యూనిట్, ఎన్టీఆర్ కోసం ఫారిన్ బ్యూటీని వెదికే పనిలో పడిందట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఓ భారీ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. మగధీర టైపులో ఇది కూడా పీరియాడిక్ డ్రామా అంటున్నారు.