మహానటి కోసం హాలీవుడ్ కెమెరామెన్

Saturday,July 08,2017 - 05:40 by Z_CLU

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమా ఇప్పుడు మరింత బిగ్ ప్రాజెక్టుగా మారింది. ఈ సినిమా కోసం తాజాగా హాలీవుడ్ కెమెరామెన్లను రంగంలోకి దించారు. అంతర్జాతీయ స్థాయిలో పలు వాణిజ్య ప్రకటనలు, డాక్యుమెంటరీలు, మ్యూజిక్ వీడియోస్ కు కెమెరామెన్ గా వర్క్ చేసిన డానీ లోపెజ్ ను మహానటి కోసం తీసుకున్నారు. ఈ ఎంపికతో మహానటి ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్ లుక్ వస్తుందని భావిస్తున్నారు.

తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయడం కామన్ అయిపోయింది. బాలయ్య పైసా వసూల్, అఖిల్ కొత్త సినిమా, ప్రభాస్ సాహో మూవీస్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు మహానటి కోసం కూడా హాలీవుడ్ నిపుణుల్ని తీసుకున్నారు.

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ కనిపించనుంది. మరో కీలకమైన పాత్రలో సమంత నటిస్తోంది. సావిత్ర భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. సమంత బాయ్ ఫ్రెండ్ గా విజయ్ దేవరకొండ నటించనున్నాడు.