నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
విశ్వక్ సేన్ ఈ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజుగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఏదో సీరియస్ కేసును విశ్వక్సేన్ డీల్ చేసేలా సన్నివేశాలను టీజర్లో చూడొచ్చు. ఎవరో బైకర్‌ను పోలీసులు వెంటాడుతున్న సీన్‌ను కూడా టీజర్లో చూడొచ్చు. సినిమా మంచి థ్రిల్లర్ అనే విషయం తెలుస్తూనే ఉంది.
హిట్ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం.. మణికందన్ సినిమాటోగ్రఫీ మెయిన్ ఎట్రాక్షన్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నారు.