హిట్ సాంగ్స్ - 2016

Friday,December 30,2016 - 08:30 by Z_CLU

 

నేను శైలజ – ఈ ఇయర్ స్టార్టింగ్ ఓ పాట యూత్ ను ఎట్రాక్ట్ చేసి అందరికీ ఫెవరెట్ అయిపోయింది. ఆ పాట మరేదో కాదు. రామ్ నటించిన ‘నేను శైలజ’ సినిమాలోని ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ పాట కు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా సింగర్  పృద్వి చంద్ర పాడారు. సినిమాలోని ‘నేను శైలజ’ తో పాటు అన్ని పాటలు సూపర్ హిట్ సాధించగా ఈ సాంగ్ మాత్రం ది బెస్ట్ సింగిల్ ఆఫ్ 2016 గా నిలిచింది.

సోగ్గాడే చిన్ని నాయనా – ఈ ఏడాది చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకూ అందరినీ అలరించి సినిమాకు హైలైట్ గా నిలిచింది ‘సోగ్గాడే చిన్ని నాయన’ టైటిల్ సాంగ్. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలోని ఈ పాట ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సింగర్ సత్య యామిని, నూతన, వినాయక్ పాడారు.

ఎక్స్ ప్రెస్ రాజా – 2016 లో ‘కలఫుల్ చిలకా’ అనే పాట అందరి నోళ్ళలో నానడం తో పాటు స్టేజీ ల మీద పార్టీ లలో హల్చల్ చేసింది. శర్వానంద్ నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లోని ఈ పాట ను ప్రవీణ్ లక్కరాజు కంపోజ్ చేయగా సింగర్ నరేంద్ర పాడారు . భాస్కరభట్ల సాహిత్యం ఈ పాట ను సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లింది. క్యాచీ లిరిక్స్ తో జోష్ ఫుల్ గా సాగే ఈ పాట 2016 అందరికీ ఫెవరెట్ అయిపోయింది.

నాన్నకు ప్రేమతో – ఈ ఇయర్ తన టాలెంట్ తో మెస్మరైజ్ చేసాడు దేవి శ్రీ ప్రసాద్. ‘నాన్నకు ప్రేమ తో’ అంటూ సాగే ఓ పాట తో అందరినీ అలరించి సినిమా చూసిన అందరికీ  ఓ చక్కని ఫీల్ కలిగించాడు డి.ఎస్.పి. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’  సినిమాలోని ఈ పాట ను కంపోజ్ చేయడం తో పాటు తనే లిరిక్స్ రాసి పాడాడు దేవి. సినిమా ఫినిష్ అయ్యాక  ఓ ఫీల్ తో ఈ పాట పాడుకుంటూ ఆడియన్స్ బయటికెళ్లారంటే ఈ పాట ఎంతటి హిట్ సాధించిందో చెప్పొచ్చు . ఈ పాటతో పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాడిన ‘ఫాలో ఫాలో’ పాట, ‘నీ మనసు నాలో’ ,’డోంట్ స్టాప్’ పాటలు కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

సాహసం శ్వాసగా సాగిపో – బెస్ట్ ఆల్బమ్ తో ఈ ఇయర్ మ్యూజిక్ లవర్ ను తన సాంగ్స్ తో అలరించి 2016 బెస్ట్ డైరెక్టర్ గా నిలిచాడు ఏ.ఆర్.రెహమాన్. ‘సాహసం శ్వాసగా సాగిపో’ పాటలు విని సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులెందరో… ‘వెళ్లి పోమాకే’, ‘తాను నేను’ ,’చెకోరి’,’కన్నుల ముందే’  పాటలు సినిమాకు హైలైట్స్ గా నిలిచి మ్యూజిక్ లవర్స్ అందరికీ ఈ ఇయర్ ఫెవరేట్ సాంగ్స్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ పాటలకు అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీజో  అందించి  లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

అ..ఆ – మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ‘అ ఆ’ ఆల్బమ్ కూడా ఈ ఏడాది హల్చల్ చేసింది. నితిన్-సమంత జంటగా రూపొందిన ఈ సినిమాలోని ‘వెళ్లి పోకే శ్యామల’ పాట బ్రేకప్ సాంగ్స్ లో ఓ మంచి ప్లేస్ సంపాదించుకుంది. మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటను కార్తిక్ పాడగా రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

బ్రహ్మోత్సవం – మహేష్ బాబు నటించిన  ‘బ్రహ్మోత్సవం’ ఆల్బమ్ కూడా ఈ ఇయర్ మ్యూజిక్ లవర్ ను బాగా అలరించి మంచి స్థానం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘ఆటపాటలాడు నలుగురితో’ పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన  ఈ పాట ను కార్తీక్ పాడారు. ఈ పాట కు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సాహిత్యాన్ని అందించడం విశేషం.

కృష్ణగాడి వీరప్రేమగాధ – ఈ ఏడాది నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాలోని ‘నువ్వంటే నా నవ్వు’ పాట తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొని హిట్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకుంది. విశాల్ చంద్ర శేఖర్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్  అందించగా హరిహరన్-సింధూరి పాడారు.

జెంటిల్ మేన్ – మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఎంతటి హిట్స్ సాదిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇయర్ ‘జెంటిల్ మెన్’ సినిమాతో అలాంటి హిట్టే మరోసారి సాధించాడు మణి శర్మ. రిలీజ్ కి ముందే విడుదల చేసిన ఈ సినిమాలోని ‘చలి గాలి చూడు’ అనే పాట సినిమా కు హైప్ తీసుకొచ్చింది. మణి శర్మ కంపోజ్ చేసిన ఈ పాట ను హరి హరన్-పద్మలత-మాళవిక పాడారు.  సిరివెన్నెల సీత రామ శాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాట కు కళ తీసుకొచ్చింది.

సర్దార్ గబ్బర్ సింగ్ – 2016లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలు కూడా మార్కెట్లో హంగామా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘ఓ పిల్లా శుభానల్లా’ పాట పవన్ ఫాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ ఫెవరెట్ లిస్ట్ లో చేరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా విజయ్ ప్రకాష్-శ్రేయ గోషాల్ పాడారు.

బాబు బంగారం – 2016 లో జిబ్రాన్ అందించిన ‘బాబు బంగారం’ ఆల్బమ్ కూడా మంచి ప్లేస్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ‘మల్లెల వానలా’ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది. వెంకటేష్-నయనతార నటించిన ఈ సినిమాలో ఈ పాట ను జిబ్రాన్ కంపోజ్ చేయగా నరేష్ ఐయ్యర్ పాడగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

ప్రేమమ్ – మెలోడీ పాటను ఇష్టపడే మ్యూజిక్ లవర్స్ ను బాగా ఇష్టపడే వారిని ‘ఎవరే ప్రేమను మాయంది’ అనే పాట బాగా ఆకట్టుకుంది. నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలోని ఈ పాట ను రాజేష్ మురుగేశన్ అనే మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయగా విజయ్ యేసుదాసు పాడారు. మలయాళం లో సినిమాకు హైలైట్ గా నిలిచిన పాట ట్యూన్ తో  తెలుగు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశారు యూనిట్. ఈ పాట కు తెలుగు లో శ్రీ మణి రాసిన లిరిక్స్, సింగర్  అందరినీ ఆకట్టుకున్నాయి.

జనతా గ్యారేజ్ – ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది ‘జనతా గ్యారేజ్’ ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అన్ని పాటలు ఆడియన్స్ బాగా అలరించగా ‘ప్రణామం’ అనే పాట మాత్రం అందరి మనసు దోచుకుంది.  హరి హరన్ పాడిన ఈ పాటలో ప్రకృతి గురించి రామజోగయ్య రాసిన లిరిక్స్ పాటను ఎలివేట్ చేశాయి.

మజ్ను – ఈ ఇయర్ అదిరిపోయే మెలోడీ సాంగ్ తో యూత్ ను ఎట్రాక్ట్ చేసి అలరించాడు గోపి సుందర్. నాని నటించిన ‘మజ్ను’ సినిమాలోని గోపి సుందర్ కంపోజ్ చేసిన ‘కళ్ళు మూసి తెరిచే లోపే’ పాట అందమైన లిరిక్స్ తో అందరిని ఆకట్టుకుంది. సుచిత్ సురేశన్ పాడిన ఈ పాటకు శ్రీ మణి సాహిత్యం అందించారు.

జయమ్ము నిశ్చయమ్మురా – 2016 లో ‘ఓ రంగుల చిలకా’ అనే పాట చిన్న సినిమా పై హైప్ తీసుకొచ్చింది. శ్రీనివాస్ రెడ్డి పూర్ణ జంటగా తెరకెక్కిన ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ సినిమాలోని ఈ పాట టాప్ డైరెక్టర్స్ ను సైతం ఆకట్టుకొని 2016  ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది.  రవి చంద్ర మ్యూజిక్ అందించిన ఈ పాట కు వి.వి.రామాంజనేయులు లిరిక్స్ అందించగా సింగర్ స్పందన పాడారు

నిర్మలా కాన్వెంట్ – ఈ ఇయర్ ‘కొత్త కొత్త భాష’ అనే పాట యూత్ ను బాగా ఆకట్టుకుంది. రోషన్ హీరోగా తెరకెక్కిన ‘నిర్మల కాన్వెంట్’ సినిమాలోని ఈ పాట నాగార్జున ని  సైతం ఎంత గానో ఎట్రాక్ట్ చేసి స్టెప్స్ వేయించింది. రోషన్ సాలూరి ట్యూన్ అందించిన ఈ పాట కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఏ.ఆర్.రెహ్మాన్ తనయుడు ఏ.ఆర్. అమీర్ ఈ పాటను పాడాడు.

ధృవ – ఈ ఇయర్ ఎండింగ్ లో మొదటి సినిమాతో సరి కొత్త ఆల్బమ్ అందించి తెలుగు ఆడియన్స్ ఎట్రాక్ట్ చేశారు హిపాప్ తమిళ. రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాతో తెలుగు లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన మ్యూజిక్ తో మంచి మార్కులే అందుకున్నాడు. ‘చూసా చూసా’ అనే పాట ఈ సినిమాకు హైలైట్ గా నిలిచి మ్యూజిక్ లవర్స్ అలరించింది.

 

 

 

సరైనోడు – ఈ ఇయర్ ‘డూ డూ ఎహ్ డూ డూ రా రా డూ డూ’ అనే పాట అందరిలో జోష్ నింపేసింది. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమాలోని ఈ పాట ను థమన్ కంపోజ్ చేయగా హార్డ్ కౌర్-బ్రిజేష్ శాండిల్య-సోను కక్కర్ లు పాడారు. ఈ పాట కు రామ జోగయ్య శాస్త్రి ఎనర్జిటిక్ లిరిక్స్ బాగా ప్లస్ అయ్యాయి..

ఊపిరి – 2016 లో అన్ని కలగలిపిన సాంగ్స్ తో కూడిన ఆల్బమ్స్ లో  ‘ఊపిరి’ కి ప్రత్యేక మైన స్థానం  ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన  ఈ సినిమాలోని అన్ని పాటలు అలరించగా ‘అయ్యో అయ్యో’ పాట మాత్రం హైలైట్ గా నిలిచింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా రంజిత్-సుచిత్ర పాడారు.