HIT ఫస్ట్ లుక్ రిలీజ్

Thursday,December 26,2019 - 12:03 by Z_CLU

నాని నిర్మాతగా HIT అనే సినిమా తెరకెక్కుతోంది. ఫలక్ నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌లో విశ్వ‌క్‌సేన్ స్టైలిష్‌గా క‌న‌ప‌డుతున్నారు. ఎస్పీ విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు.

హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న నాని… కొత్త కథలు, యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ పై తొలి ప్రయత్నంగా “అ!” అనే సినిమా నిర్మించాడు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు HIT మూవీ తీస్తున్నాడు.

నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్‌పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తోన్న ఈ సినిమాలో రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శైలేష్ కొల‌ను
స‌మ‌ర్ప‌ణ‌: నాని
నిర్మాత‌: ప‌్ర‌శాంతి త్రిపిర్‌నేని
మ్యూజిక్‌: వివేక్‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌ట‌ర‌త్నం(వెంక‌ట్‌)
స్టంట్స్‌: న‌భా
ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా