బాలీవుడ్ కు "హిట్"

Tuesday,May 26,2020 - 04:09 by Z_CLU

తెలుగులో ఈమధ్య కాలంలో హిట్టయిన సినిమాల్లో హిట్ ఒకటి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మించిన ఈ మూవీతో శైలేష్ కొలను డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు నాని నుంచి రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్టు టాక్.

ప్రస్తుతం హిందీలో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. దీంతో పాటు పైప్ లైన్లో ఎఫ్-2 సినిమా ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి ”హిట్” కూడా చేరింది. బాలీవుడ్ లో రీమేక్ అయ్యే క్వాలిటీస్ అన్నీ హిట్ సినిమాకు ఉన్నాయి.