ప్రీ ప్రొడక్షన్ కోసం 15 కోట్లు !

Tuesday,June 30,2020 - 05:38 by Z_CLU

రానా హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో ‘హిరణ్య కశిప’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటివలే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టారట. జస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఇంత ఖర్చు పెట్టారంటే సినిమా మొదలయ్యాక ఎంత ఖర్చు అవుతుందో అని సినిమా చుట్టూ బజ్ నెలకొంది.

నిజానికి సినిమా అనౌన్స్ చేసినప్పుడే దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుందని చెప్పారు సురేష్ బాబు. ఈ లెక్కన చూస్తే మేకింగ్ కోసం ఆ మార్క్ రీచ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక సినిమాకు భారీ లెవెల్ లో గ్రాఫిక్స్ చేయించాల్సి ఉంటుంది. దానికి ఇంకా అదనంగా ఖర్చయ్యే అవకాశం ఉంది. లేదంటే అనుకున్న బడ్జెట్ లోనే గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తవుతుందా చూడాలి.

ఏదేమైనా ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్కేల్ లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు సురేష్ బాబు.