హిప్పీ’ ఇద్దరికీ కలిసి రాలేదు...

Wednesday,June 12,2019 - 02:02 by Z_CLU

RX 100 కి కి ముందు పాయల్ రాజు పుత్ ఎవరో కూడా తెలీదు. కానీ RX 100 పాయల్ కరియర్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కానీ అదే హీరోతో ‘హిప్పీ’ సినిమాలో నటించిన దిగంగన, జజ్బా సింగ్ లకు మాత్రం ఈ సినిమా పెద్దగా కలిసి రాలేదు.

దిగంగన ఇప్పటికే హిందీలో 3 సినిమాలు చేసింది. మంచి ఆఫర్ దొరికితే తెలుగులో లాంచ్ అవుదామనుకుని చూస్తున్న టైమ్ లో వచ్చిన ఆఫర్ ‘హిప్పీ’. అప్పటికే కార్తికేయ RX 100 సెన్సేషన్ క్రియేట్ చేసి ఉంది. ఆ సినిమా తరహాలో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే ధీమాతో ఈ సినిమాని ఎంచుకుంది దిగంగన.

 

జజ్బా సింగ్ కూడా ఆల్మోస్ట్ అంతే.. తన కరియర్ లోనే ఇది ఫస్ట్ సినిమా. మాడలింగ్ తో బిజీగా ఉన్న ఈ భామ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ‘హిప్పీ’ మళ్ళీ వెనక్కి నెట్టేసింది.

 ‘హిప్పీ’ చెప్పుకోదగ్గ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయకపోయినా మంచి ఆఫర్ దొరకాలే కానీ, ప్రూఫ్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు దిగంగన… జజ్బా సింగ్. చూడాలి మరీ వీళ్ళిద్దరిని సక్సెస్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగే సినిమా ఆఫర్ వీళ్ళకు వస్తుందో లేదో…