కబాలి సినిమాలో హైలెట్ అదే...

Friday,July 22,2016 - 03:36 by Z_CLU

 

భారీ అంచనాల మధ్య విడుదలైన కబాలి సినిమా తలైవ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా చాలా బాగుందంటూ ఫ్యాన్స్ అంతా మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కబాలిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చిందంటూ అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. 30ఏళ్ల యువకుడిగా రజనీకాంత్ కనిపించిన తీరు, ఆ హావభావాలు, మలేషియాలోని తమిళుల కోసం సూపర్ స్టార్ చేసిన పోరాటం… ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. మరీ ముఖ్యంగా సినిమాలో రజనీకాంత్ ఇంట్రడక్షన్ సీన్ హైలెట్ గా ఉందంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో తలైవ సినిమా షురూ అయింది. ఈ వీకెండ్ సరికి ఈ మూవీ ఎంత వసూలు చేస్తుందనే విషయంపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.