బాహుబలి 2 లో హైలెటెడ్ క్వశ్చన్స్ – 2

Wednesday,April 26,2017 - 03:15 by Z_CLU

బాహుబలి ది బిగినింగ్ ఇంకా కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ ఫస్ట్ పార్ట్ తో ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం కాబోతుంది. ఫ్యాన్స్ లో రేజ్ అయిన క్వశ్చన్స్ లో మరిన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇవే…

ఇంతకీ కట్టప్ప ఎవరి పక్షం

 

సింహాసనానికి కట్టుబానిస అయిన కట్టప్ప బాహుబలి 2 లో ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు..? లెక్క ప్రకారం మహారాజు భళ్ళాల దేవుడు కాబట్టి, తన పక్షానే నిలబడాలి. కంక్లూజన్ లో కట్టప్ప క్యారెక్టర్ లో బోలెడన్ని వేరియేషన్స్ ఉంటాయని చెప్తుంది సినిమా యూనిట్. భళ్ళాల దేవుడు, కట్టప్ప, మహేంద్ర బాహుబలి మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ హైలెట్ కాబోతున్నాయి…?

అంతర్యుద్దానికి కారణం ఏమై ఉంటుంది..?

 

బాహుబలి 2 ట్రేలర్ లో హైలెట్ అయిన ఒకే ఒక్క పదం ‘అంతర్యుద్ధం’. ఈ పదం జస్ట్ ట్రేలర్ కే కాదు, మొత్తం సినిమాకే హైలెట్ కాబోతుంది. అసలీ అంతర్యుద్దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి..? ఇంకో రెండు రోజుల్లో కంప్లీట్ గా క్లారిటీ వచ్చేస్తుంది.

కుంతల రాజ్యం సంగతేంటి..?

అసలు మాహిష్మతి సామ్రాజ్యానికి, కుంతల రాజ్యానికి సంబంధం ఏంటి..? కుంతల శతృ రాజ్యమా..? మిత్ర రాజ్యమా..? ఏ సందర్భంలో సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతుంది…? ఇలా ఆలోచించడం మొదలు పెడితే బాహుబలి 2 లో ‘కుంతల రాజ్యం’ పెద్ద క్వశ్చన్ బ్యాంక్ లా తయారవుతుంది. దానికన్నా ఈ పాయింట్ ని కాస్త చూసీ చూడనట్టు పక్కన పెట్టేసి ఇంకో 2 రోజులు ఓపిక పట్టడమే బెస్ట్ సొల్యూషన్.

మహారాణి దేవసేన మ్యాజికల్ మిస్టరీ  

రీసెంట్ గా కుంతల రాజ్యపు మహారాణి అంటూ దేవసేన స్టిల్ ఒకటి రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అసలు దేవసేన తల్లిదండ్రులెవరు..? అసలీ కంక్లూజన్ కాన్వాస్ లో ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కానున్నాయి..? అసలీ దేవసేన బ్యాక్ గ్రౌండ్ ఏంటి…? బాహుబలి – ది బిగినింగ్ లో చిన్న క్లూ కూడా ఇవ్వని డైరెక్టర్, దేవసేన చుట్టూ ఇంకా మ్యాజిక్స్ ప్లాన్ చేశాడో తెలియాలంటే రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.

భళ్ళాలుడే చంపాలని చూస్తాడా..?

బాహుబలి ది బిగినింగ్ లో శివగామిని చంపడానికి మనుషులు వెంట పడుతుంటారు… కంక్లూజన్ లో బిజ్జాల దేవుడు ‘మీ అమ్మను చంపాలని నీకనిపించిందా’ అని అడుగుతాడు. అంటే శివగామిపై జరిగిన హత్యా ప్రయత్నం భళ్ళాలుడు చేయించాడా..? అంతలా శివగామిని దేవి హత్యకు డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమై ఉంటాయి..?

అసలేం జరిగి ఉంటుంది..?

అసలు శివగామి మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించింది బాహుబలిని కదా… మరి రాజ్యం భళ్ళాలుడి చేతికి ఎప్పుడు వచ్చింది..?, బాహుబలి 2 ట్రేలర్ లో అమరేంద్ర బాహుబలి ‘మాహిష్మతి ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా…’ అని చేసిన ప్రమాణం… డిఫెరెంట్ క్లూస్ ని జెనెరేట్ చేసింది.. అంటే ఆ ప్రమాణం రాజుగా చేశాడా…? సైన్యాధ్యక్షకుడిగా చేశాడా..? ఈ లోపే ఏదో బలమైన సిచ్యువేషన్ ఆక్యుపై చేసి ఉండాలి..? అదేమై ఉంటుంది.

ఇంతకీ భళ్ళాలుడి భార్య సంగతేంటి..?

ఇంతకీ భళ్ళాలుడి భార్య ఎవరు..? బాహుబలి ది బిగినింగ్ లో బాహుబలి చేతిలో చనిపోయిన భద్ర, భళ్ళాలుడి కొడుకేనని తెలుస్తున్నా, ఇప్పటికీ ఎక్కడా భళ్ళాలుడి భార్య గురించి ప్రస్తావన రాలేదు. సినిమా యూనిట్ ఈ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసిందా..? లేకపోతే ఓ చిన్న నిడివి తో ప్యాకప్ చెప్పేసిందా..? అసలీ క్యారెక్టర్ లో ఎవరు నటించారు..? ఎందుకు ప్రమోషన్స్ లో మెన్షన్ చేయలేదు.

అమరేంద్ర బాహుబలి నిజంగానే చనిపోయాడా..?

ఇంతకీ కట్టప్ప నిజంగానే బాహుబలిని చంపేశాడా..? లేకపోతే రాజ్యాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయాడా..? అసలేం జరిగి ఉంటుంది..? సవాలక్ష క్వశ్చన్స్ రేజ్ చేసిన బాహుబలి ది బిగినింగ్, ఇప్పుడు కంక్లూజన్ లో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ కానుంది. ఇంకా జస్ట్ రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ మ్యాగ్నం ఓపస్ ప్రతి సెంటర్ లో డిస్కషన్ టాపిక్ లా మారింది. రోజుల తరబడి వెయిట్ చేసిన అబాహుబలి ఫ్యాన్స్ ఇప్పుడు గంటల్ని లెక్క పెడుతున్నారు.