బాహుబలి కంక్లూజన్ లో హైలైటెడ్ క్వశ్చన్స్

Tuesday,April 25,2017 - 02:06 by Z_CLU

బాహుబలి రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉంది. బాహుబలి – ది బిగినింగ్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూనే, బోలెడన్నీ  క్వశ్చన్స్ ని రేజ్ చేసింది. ఆ  క్వశ్చన్స్ అన్నింటికీ జస్ట్ 3 డేస్ లో ఆన్సర్ దొరకబోతుంది.

 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? : బాహుబలి 1 రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ గా రేజ్ అయిన క్వశ్చన్ ఇది. జస్ట్ ఈ క్వశ్చన్ ని బేస్ చేసుకుని ఎన్నో స్టోరీస్ సోషల్ మీడియాని రూల్ చేశాయి. ఎంతలా గెస్ చేసినా, ఇమాజినేషన్ చేసుకున్నా అసలు సమాధానం మాత్రం బాహుబలి కంక్లూజన్ లోనే దొరుకుతుంది.

రానా అనుష్కను ఎందుకంతలా హింసించాడు..?: బాహుబలి లోని ప్రతి సీన్ అద్భుతమే. ఆ అద్భుతంలో కాస్త హృదయ విదారకం అనిపించేది దేవసేన దుస్థితి. అలాంటి పరిస్థితుల్లోను దేవసేన ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ తో ఉండటం హైలెటే అయినా.. అసలు భల్లాలదేవ, దేవసేనను ఎందుకంతలా హింసించాడు..? అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే. దేవసేన కుంతల రాజ్యపు రాకుమారి అని తెలుస్తున్నా, భళ్ళాలుడు ఆ రేంజ్ లో కక్ష కట్టడానికి కారణం మాత్రం తెలీలేదు.

భల్లాలదేవ దేవసేనను ప్రేమిస్తాడా..?: ‘నన్ను కాదన్నావ్.. వాడే కావాలన్నావ్..’ దేవసేన కళ్ళలోకి సూటిగా చూస్తూ భళ్ళాలదేవ అన్న మాట ఇది. ఎగ్జాక్ట్ గా ఏమేం జరిగి ఉంటుందో గెస్ చేయడం కొంచెం కష్టమే కానీ, దేవసేనను భళ్ళాలదేవ ప్రేమించాడా..? అనే క్వశ్చన్ కి కాస్త అటూ ఇటూగా అయినా ప్రేమించే ఉంటాడు… అనే కంక్లూజన్ దగ్గరే పోల్ అవుతున్నాయి ఒపీనియన్స్. ఏది ఏమైనా అసలు గుట్టేంటో మూడు రోజుల్లో తేలిపోతుంది.

అవంతికకు రాజభవనానికి ఏంటి సంబంధం..? : అసలు అవంతిక ఎవరు..? బాహుబలి – ది బిగినింగ్ లో ఎపుడో చిన్నప్పుడు దూరమైన బాహుబలిని మళ్ళీ రాజభవనానికి కనెక్ట్ చేసే వారధిలా నిలిచిందీ క్యారెక్టర్. కానీ నిజానికి రాజభవనానికి అవంతికకు ఉన్న అసలు సంబంధం పార్ట్ 1 లో ఏ మాత్రం ఎలివేట్ కాలేదు. దీనికి తగ్గ కంక్లూజన్ కూడా పార్ట్ 2 లోనే దొరుకుతుంది.

రమ్యకృష్ణ చేసిన తప్పేంటి..?:  ‘ పరమేశ్వరా…. నేను చేసిన తప్పులకు నా చావే పరిష్కారమైతే నా ప్రాణాలు తీసుకో’  ఇది రమ్యకృష్ణ నీట మునిగేటప్పుడు భగవంతుడితో వేడుకున్న చివరి మాట. దీని చుట్టూ కూడా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు శివగామి చేసిన తప్పేంటి..? ఏ పరిస్థితుల్లో చేసి ఉంటుందీ..? దాని వల్ల ఏం జరిగింది..? ఇలా చెప్పుకుంటూ పోతే బాహుబలి 2 మొత్తం ఈ క్వశ్చన్ చుట్టే డెవెలప్ అయిందనిపిస్తుంది. కట్టప్ప బాహుబలిని చంపే క్వశ్చన్ తరవాత మళ్ళీ అదే రేంజ్ లో హైలెట్ అవుతున్న క్వశ్చన్ ఇదే.

బాహుబలి 2 లో అస్లాం ఖాన్ రోల్ ఏంటి..? :

కట్టప్ప స్ట్రెంత్ ని ఎలివేట్ చేసే ప్రాసెస్ లో ఇంట్రడ్యూస్ అయింది అస్లాం ఖాన్ క్యారెక్టర్. ఏది ఏమైనా కట్టప్పకు ఫ్యూచర్ లో ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను అని అస్లాం ఖాన్ మాటివ్వడంతో ఆ సీన్ క్లోజ్ అవుతుంది. అంటే బాహుబలి – కంక్లూజన్ లో ఈ క్యారెక్టర్, కీ స్పేస్ ఆక్యుపై చేయనుందా..? జస్ట్ ఆ ఒక్క సీన్ కోసమే ఆ క్యారెక్టర్ ని వాడుకుని వదిలేశారా..? దీనికి సమాధానం సినిమా చూస్తేనే తెలుస్తుంది.

సుబ్బరాజుకు బాహుబలి – 2 తో కనెక్షన్ ఏంటి..? :

బాహుబలి 2 షూటింగ్ కూడా బిగిన్ కాకముందే సుబ్బరాజు కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు అన్న విషయం బయటికి వచ్చేసింది. కానీ ఎంతలా ఆలోచించినా ఈ క్యారెక్టర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఫిట్ అవుతుందో అంతు చిక్కడం లేదు. సుబ్బరాజు ప్లే చేసిన క్యారెక్టర్, మాహిష్మతి రాజ్యానికి సంబందించిందా..? లేక దేవసేన రాజ్యానికి సంబందించిందా..? సుబ్బరాజు ప్లే చేసిన ఈ క్యారెక్టర్ చుట్టూ ఇప్పటికే లెక్కలేనన్ని క్వశ్చన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

 

బాహుబలి దేవసేన ఎక్కడ కలుసుకుంటారు..? :

బాహుబలి దేవసేన కలుసుకున్నాక… కుంతల రాజ్యానికి, మాహిష్మతి సామారాజ్యానికి రిలేషన్ క్రియేట్ అవుతుందా లేక, కుంతల రాజ్యం, మాహిష్మతి రాజ్యానికి ఉన్న సత్సంబంధాల వల్ల వీరిద్దరూ కలుసుకుంటారా..? అసలు వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా బిగిన్ అవుతుంది..? ఈ క్వశ్చన్ మాత్రం బియాండ్ ఇమాజినేషన్ పేజ్ లో ఉంది. హై ఎండ్ క్యూరాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ క్వశ్చన్ కి ఆన్సర్ బాహుబలి కంక్లూజన్ లోనే దొరుకుతుంది.