జీ సినీ అవార్డ్స్ తెలుగులో హైలెటెడ్ పర్ఫామెన్సెస్

Tuesday,January 28,2020 - 10:02 by Z_CLU

జీ సినీ అవార్డ్స్ తెలుగుతో ఈ వీకెండ్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు ఆడియెన్స్. తమ ఫేవరేట్ స్టార్స్ అందరూ ఒక్కచోట చేరి సందడి చేసే ఈ ఈవెంట్ కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కోసం స్టార్ మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్సెస్ తో మెస్మరైజ్ చేశారు. వాటిలో హైలెట్ నిలిచినవివే.

ఈ ఈవెంట్ గురించి మాట్లాడితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కార్తికేయ పర్ఫామెన్స్ గురించి. మెగాస్టార్ చిరంజీవికి ట్రిబ్యూట్ గా కార్తికేయ, మోస్ట్ మెగా సాంగ్స్ కి వేసిన స్టెప్పులకు ఆడియెన్స్ ఉర్రూతలూగారు. పర్ఫామెన్స్ చివరన కార్తికేయ ఇచ్చిన స్పీచ్ మెగాస్టార్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ని ఎలివేట్ చేస్తుంది.

ఇక ఇమ్మీడియట్ గా చెప్పుకోవాల్సింది నిధి అగర్వాల్ హాట్ పర్ఫామెన్స్ గురించి. తన సినిమాల్లోని మాట్లాతో స్టేజ్ పై మరోసారి హీట్ జెనెరేట్ చేసిన ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఈ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలోని మాస్ నంబర్ ‘ఇరగఇరగ’ సాంగ్ తో దుమ్ము దులిపింది అనసూయ. అదిరిపోయే స్టెప్స్ తో వీకెండ్ సాయంత్రానికి మరింత మ్యాజిక్ ని ఆడ్ చేసింది.

ఇక రెజీనా జీ తెలుగు గ్రాండ్ ఈవెంట్ లో బాలీవుడ్ ని దించేసింది. దీపికా పాడుకొనే ‘పద్మావతి’ సినిమాలోని ‘ఘూమర్ ఘూమార్ ఘూమే’ సాంగ్ తో కళ్ళకి ఫీస్ట్ లాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది. వైట్ కలర్ అవుట్ ఫిట్ లో ఏంజిల్ లా కనిపించింది.

ఇక మెహ్రీన్ ఈ వీకెండ్ సాయంత్రాన బార్బీ డాల్ లా కనిపించింది. తన మ్యాజికల్ పర్ఫామెన్స్ తో స్టేజ్ పై ఫైర్ జెనెరేట్ చేసింది.

నభా నతేష్ తన ఇస్మార్ట్ ఆటిట్యూడ్ తో ఇరగదీసింది. తన కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సాంగ్స్ కి మాసీ స్టెప్స్ వేసి కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది.   

ఆవార్డ్ ఫంక్షన్ పూర్తి వీడియో కోసం క్లిక్ చేయండి