మహేష్ బహిరంగ సభలో హైలెట్ కాబోయే ఎలిమెంట్

Friday,April 06,2018 - 01:14 by Z_CLU

మహేష్ ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లో ని L.B. స్టేడియం లో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ NTR చీఫ్  గెస్ట్ గా రానుండటంతో, అటు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు, ఇటు NTR ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ ఈవెంట్ లో NTR స్పీచ్ హైలెట్ కానుంది.

ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ సినిమాపై మరింత పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. రేపు జరగనున్న ఈ ఈవెంట్ లో సినిమాలోని తక్కిన సాంగ్స్ తో పాటు, ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసే చాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. D.V.V. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.