సాక్ష్యం లో హైలెట్ కానున్న ఎలిమెంట్

Thursday,May 31,2018 - 10:03 by Z_CLU

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంచ భూతాల నేపథ్యంలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. అయితే ఈ పాటని ఏకంగా 5 గురు పాప్యులర్ సింగర్స్ పాడనున్నారు.

S.P. బాల సుబ్రహ్మణ్యం, ఏసుదాస్, హరి హరన్ , కైలాష్ ఖేర్, బాంబే జయశ్రీ కాలిసి పాడనున్న ఈ సాంగ్ సినిమాలో హైలెట్ కానుందని తెలుస్తుంది. పంచభూతాలకు సంబంధించి సినిమాలో సందర్భానుసారంగా ఈ సాంగ్ ఉండబోతుంది.

జూలై 20 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.