శర్వానంద్ కరియర్ లోనే హైయెస్ట్

Monday,February 06,2017 - 01:04 by Z_CLU

ఎప్పుడో లాస్ట్ మంత్ సెలెబ్రేట్ చేసుకున్న సంక్రాంతి ఫీవర్ ఇంకా తగ్గలేదా అంటే… లేదనే చెప్పాల్సి వస్తుంది. సరిగ్గా సంక్రాంతి రోజు రిలీజైన ‘శతమానం భవతి’ పాజిటివ్ టాక్స్ తో బిగిన్ అయి, ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదే స్ట్రెంత్ తో వసూలు చేస్తూనే ఉంది.

ఇప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శతమానం భవతి ఇప్పటికే 30 కోట్లు వసూలు చేసి, శర్వానంద్ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూస్తుంటే ఈ వసూళ్ళ పర్వం ఇప్పట్లో ఆగే సూచనలు కూడా పెద్దగా కనిపించడం లేదు.

shatamanambhavathi-pic

దిల్ రాజు బ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో పాటు, ఇంటర్నల్ ఫ్యామిలీ వ్యాల్యూస్ ని, తెలుగు వారి కల్చర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్న శతమానం భవతి సక్సెస్, మరిన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు ఇన్స్ పిరేషన్ గా నిలుస్తుంది.