రాజమౌళి ‘RRR’ లో హై వోల్టేజ్ ఎలిమెంట్

Friday,November 23,2018 - 12:03 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది రాజమౌళి ‘RRR’. సోమవారం నాడు సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే పనిలో ఉంది టీమ్. అయితే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించడానికి ఏకంగా 120 కెమెరాలను వాడుతున్నారు ఫిల్మ్ మేకర్స్.

NTR, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ అనగానే అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలోని ప్రతి సిచ్యువేషన్ ని గ్రాండియర్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు జక్కన్న. అందుకే సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ లో NTR, రామ్ చరణ్ ల రియల్ టైమ్ ఎక్స్ ప్రెషన్స్ ని క్యాప్చర్ చేయడానికి 120 కెమెరాలను వాడుతున్నాడు.

ఈ సినిమాలో చెర్రీ, NTR సరసన నటించనున్న హీరోయిన్స్ విషయంలో ఇంకా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తుంది టీమ్. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. ఈ సినిమా 2020 లో రిలీజవుతుంది.