అభినేత్రి పై భారీ అంచనాలు

Wednesday,September 28,2016 - 09:50 by Z_CLU

సబ్జెక్ట్ ఎలాంటిదైనా ఇరగదీయడమే తమన్న కాన్సెప్ట్. యాక్టింగ్ అయినా డాన్సింగ్ అయినా… తమన్నా డైరీలో ఇలాంటి పాత్ర చేయకూడదు అనే రూలే ఉండదు. అందుకే ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీది ప్రత్యేక స్థానం. అప్ కమింగ్ మూవీ ‘అభినేత్రి’ కూాడా సమ్ థింగ్ స్పెషల్ గానే ఉండబోతోంది…

ట్రయిలర్ చూస్తుంటే ఇది కచ్చితంగా హారర్ సినిమా అనుకుంటాం. అలాంటిది పర్టికులర్ గా దసరా రోజున ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యే సమాధానం ఇచ్చింది తమన్నా. అసలు అభినేత్రి హారర్ సినిమానే కాదట. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటోంది.

సబ్జెక్ట్ లో హారర్ ఉంటుంది కానీ పూర్తిగా హారర్ సినిమా కాదనేది మిల్కీబ్యూటీ కాన్సెప్ట్. సంసార పక్షంగా ఉండే దేవి పాత్రతో పాటు మోడ్రన్ గా ఉండే రూబీ పాత్రలో అలరించనుంది. అయితే ఇందులో దెయ్యంగా కనిపించేది దేవీనా… లేక రూబీనా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రెండు పాత్రల్లో తమన్న చించేసిందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.

siv_41560436

సినిమా ఇండస్ట్రీలో కండలు తిరిగిన డ్యాన్సింగ్ స్టార్ లు సైతం కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయే డ్యాన్సర్ తమన్నా. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది స్వయంగా తమన్నానే అసలు ఇప్పటి దాకా నేను చేసింది డ్యాన్సే కాదు అంటే ఎలా ఉంటుంది..? ఆ విషయమే ఆరా తీస్తే… “ప్రభుదేవాతో పని చేశాక కానీ డ్యాన్స్ అంటే ఏంటో అర్థం కాలేదు. ఆయన టాలెంట్, డ్యాన్స్ పట్ల ఆయనకున్న ప్యాషన్ ముందు ఇప్పటివరకు తను చేసింది డ్యాన్సే కాదంటోంది మిల్కీబ్యూటీ.

తమన్న, ప్రభుదేవాతో పాటు సోనూసూద్ కూడా ఓ కీలక పాత్ర పోషించిన అభినేత్రి సినిమా దసరా కానుకగా ఒకేసారి తెలుగు-తమిళ-హిందీ భాషల్లో విడుదలకానుంది.