అర్జున్ రెడ్డికి ఎందుకింత క్రేజ్

Wednesday,February 15,2017 - 04:08 by Z_CLU

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ట్రేలర్ ఫిబ్రవరి 13 న రిలీజ్ అయింది. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక్క టీజర్ తోనే మ్యాగ్జిమం యూత్ ని ఎట్రాక్ట్ చేసేసింది. ఇంతకీ అర్జున్ రెడ్డి లో ఎట్రాక్ట్ చేస్తున్న కీ ఎలిమెంట్ ఏమై ఉంటుంది…?

పెళ్ళి చూపులు లాంటి డీసెంట్ హిట్ తరవాత విజయ్ దేవరకొండని ఇలాంటి క్యారెక్టర్ లో చూడటం సినిమా లవర్స్ కి చిన్న సైజు సర్ ప్రైజే. దానికి తోడు యూత్ టార్గెటెడ్ కంటెంట్, విజయ్ న్యాచురల్ పర్ఫామెన్స్, బాడీ లాంగ్వేజ్ సినిమా మెయిన్ కంటెంట్  కి ఆప్ట్ అయినట్టే అనిపిస్తుంది.

ప్రొఫెషనల్లీ డాక్టర్ అయిన అర్జున్ రెడ్డి అనే పర్టికులర్ ఇంటలిజెంట్ డాక్టర్, ప్రతి చిన్న విషయానికి హద్దులు దాటి కోపం తెచ్చుకోవడం, తన లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందనే ప్లాట్ తో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ కి ముందే… జస్ట్ ఒక్క ట్రేలర్ తో సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కావాల్సినంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకుంది.